Share News

Gold Rates on 14 Oct: దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:55 AM

బంగారం వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. మరి నేడు దేశంలో వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.

Gold Rates on 14 Oct: దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
Gold and Silver Rates on Oct 14

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలను అందుకుంటున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 బంగారం ధర రూ.1,25,410గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,960, 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.94,060కి చేరుకున్నాయి. వెండి ధరల్లో కూడా ఇదే దూకుడు కనిపిస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,85,100కి చేరుకుంది (Gold, Silver Rates on 14, Oct, 2025) .

ఇక అంతర్జాతీయంగా కూడా బంగారం ధరల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం తొలిసారిగా 4100 డాలర్ల మార్కును దాటింది. ప్రస్తుత దేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ర్యాలీకి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి కొనసాగుతున్న యుద్ధాలు, అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-హమాస్ పోరు వంటివన్నీ మదుపర్లకు మార్కెట్‌లపై నమ్మకం తగ్గించాయి. భద్రమైన పెట్టుబడిగా పేరొందిన బంగారం వైపు మళ్లేలా చేస్తున్నాయి. అమెరికా డాలర్ అంతకంతకూ బలహీనపడటం కూడా బంగారానికి డిమాండ్ పెంచింది. 2025లో ఇప్పటివరకూ డాలర్ విలువ 10 శాతం పతనం కావడంతో జనాలు బంగారం, వెండి ఇతర విలువైన లోహాల వైపు మళ్లుతుండటంతో ధరలకు రెక్కలు వచ్చాయి.

వివిధ నగరాల్లో బంగారం ధరలు(24కే, 22కే, 18కే)

  • చెన్నై: ₹1,26,340; ₹1,15,810; ₹95,710

  • ముంబై: ₹1,25,410; ₹1,14,960; ₹94,060

  • ఢిల్లీ: ₹1,25,560; ₹1,15,110; ₹94,210

  • కోల్‌కతా: ₹1,25,410; ₹1,14,960; ₹94,060

  • బెంగళూరు: ₹1,25,410; ₹1,14,960; ₹94,060

  • హైదరాబాద్: ₹1,25,410; ₹1,14,960; ₹94,060

  • కేరళ: ₹1,25,410; ₹1,14,960; ₹94,060

  • పూణె: ₹1,25,410; ₹1,14,960; ₹94,060

  • వడోదరా: ₹1,25,460; ₹1,15,010; ₹94,110

  • అహ్మదాబాద్: ₹1,25,460; ₹1,15,010; ₹94,110


వెండి ధరలు ఇవీ

  • చెన్నై: ₹1,97,100

  • ముంబై: ₹1,85,100

  • ఢిల్లీ: ₹1,85,100

  • కోల్‌కతా: ₹1,85,100

  • బెంగళూరు: ₹1,85,100

  • హైదరాబాద్: ₹1,97,100

  • కేరళ: ₹1,97,100

  • పూణె: ₹1,85,100

  • వడోదరా: ₹1,85,100

  • అహ్మదాబాద్: ₹1,85,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

U S Senate Approves Biosecurity Ac: భారత ఫార్మా సీడీఎంఓ కంపెనీలకు ఊతం

మార్కెట్‌కు ట్రంప్‌ సుంకాల పోటు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 14 , 2025 | 09:53 AM