నాలుగేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన వృద్ధుడికి జీవిత ఖైదు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:49 AM
నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన 76ఏళ్ల వృద్దుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.
హైదరాబాద్సిటీ, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన 76ఏళ్ల వృద్దుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. గోల్కొండ ప్రాంతానికి చెందిన నారాయణ(76).. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2025 జూన్లో ఈ దారుణం జరిగింది.
జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన నాంపల్లి 12వ అదనపు సెషన్స్ జడ్జి అర్చనకుమారి.. నేరం రుజువు కావడంతో నారాయణకు జీవితఖైదుతోపాటు రూ.25 వేల జరిమానా విదిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
భర్తను చంపించి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..
బాలికలతో అసభ్య ప్రవర్తన.. తండ్రీకొడుకుల అరెస్టు
Read Latest Telangana News And Telugu News