అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:34 AM
అమెరికాలో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహిళ మృతి చెందింది.
ఖమ్మంరూరల్/మరిపెడ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహిళ మృతి చెందింది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న దారం శ్రీనివాసరావు, జ్యోతి దంపతుల కుమార్తె సుప్రియ (31)కు, మహబూబాబాద్ పట్టణానికి చెందిన కొదుమూరి రంజిత్‌కు 2022లో వివాహం జరిగింది. రంజిత్ అమెరికాలోని సెయింట్ లూయి్‌సలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా.. సుప్రియ అక్కడే ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోంది.
వీరికి సాయి అద్వైత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సుప్రియ శనివారం రాత్రి రెస్టారెంట్‌ను మూసివేసి కారులో తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వస్తుండగా.. వెనుక నుంచి ఓ ట్రక్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రియ మృతి చెందింది. ఆమె స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వార్త విన్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సుప్రియ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.
ఇవి కూడా చదవండి...
ఖర్గే వ్యాఖ్యలు ప్రజల విచక్షణను అవమానించడమే
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
7.56 లక్షల హెల్త్‌కార్డుల డౌన్‌లోడ్
Read Latest AP News And Telugu News