టర్కీలో భారీ భూకంపం.. సునామీతో పరుగులు తీసిన జనం, పేకమేడల్లా కూలిన భవంతులు

ABN , First Publish Date - 2020-10-31T00:35:43+05:30 IST

టర్నీ‌‌లోని ఏజియన్ సముద్రంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. దీంతో..

టర్కీలో భారీ భూకంపం.. సునామీతో పరుగులు తీసిన జనం, పేకమేడల్లా కూలిన భవంతులు

అంకారా: టర్కీ‌‌లోని ఏజియన్ సముద్రంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. దీంతో అలలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. సునామీ భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. సముద్రంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్టు డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అథారిటీ (ఏఎఫ్ఏ‌డీ) ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఇజ్మీర్‌లో తీవ్రమైన భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ తీవ్రతకు ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు పేకమేడల్లా కుప్పకూలాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.




Updated Date - 2020-10-31T00:35:43+05:30 IST