పాఠశాలలు, కళాశాలల్లో రెడ్‌క్రాస్ యూనిట్లు
ABN, First Publish Date - 2020-06-27T08:34:34+05:30
కరోనా సోకకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సంక్షోభ సమయంలో శిక్షణ ..
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): కరోనా సోకకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సంక్షోభ సమయంలో శిక్షణ పొందిన రెడ్‌క్రాస్ వలంటీర్ల ఆవశ్యకత ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారత రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్రంలో నూతన వలంటీర్ల నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆయన ఆవిష్కరించారు. పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ యూనిట్లు స్థాపించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను గవర్నర్ ఆదేశించారు.
Updated Date - 2020-06-27T08:34:34+05:30 IST