ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా బంగ్లా నౌక

ABN, First Publish Date - 2020-12-20T06:23:27+05:30

తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్‌ నౌక ‘ఎంవీ మా’ త్వరలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మారనుంది. దీనిపై రాష్ర్ట్ర ప్రభుత్వం సంప్రతింపులు జరుపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెక్‌పై ఒక వైపు డ్రింక్‌ అండ్‌ డైన్‌

మరోవైపు ఫ్యామిలీస్‌కు...

సెలబ్రేషన్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

వినియోగంపై ఏయూ, మారీటైమ్‌ వర్సిటీల ప్రొఫెసర్లతో పర్యాటక శాఖ అధికారుల చర్చలు 

త్వరలోనే డీపీఆర్‌ తయారీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకువచ్చిన బంగ్లాదేశ్‌ నౌక ‘ఎంవీ మా’ త్వరలో ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మారనుంది. దీనిపై రాష్ర్ట్ర ప్రభుత్వం సంప్రతింపులు జరుపుతోంది. ఈ విషయమై పర్యాటక శాఖ అధికారులు ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మెరైన్‌ విభాగం ప్రొఫెసర్లు, సబ్బవరంలోని మారీటైమ్‌ యూనివర్సిటీ అధికారులతో చర్చించారు. యాజమాన్యం నౌకను ఇవ్వడానికి అంగీకరిస్తే...దానిని పర్యాటక ప్రాంతంగా మార్చడానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, ముందుకు వెళ్లవచ్చునని వారు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


అక్టోబరు రెండో వారంలో తుఫాన్‌కు పోర్టు యాంకరింగ్‌ ప్రాంతం నుంచి బంగ్లాదేశ్‌ నౌక ‘ఎంవీ మా’ తెన్నేటి పార్కు వద్దకు కొట్టుకువచ్చింది. దానిని తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లే బాధ్యతను అమెరికాకు చెందిన రిసాల్వ్‌ మెరైన్‌ కంపెనీకి అప్పగించారు. సముద్రపు పోటు సమయంలో నౌకను లోపలకు తీసుకువెళ్లాలని యత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో నౌకను తుక్కుగా విక్రయించాలని నౌక యాజమాన్యం నిర్ణయించింది. నౌకను విడదీసి తుక్కుగా మార్చడానికి కూడా ప్రత్యేక అనుమతులు అవసరం. కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా ఊపాలి. అది అంత త్వరగా జరిగే పని కాదు. ఈలోగా నౌక మరింత పాడైపోతుంది. తుక్కుగా అమ్మితే కోటి రూపాయల వరకు వస్తుందని అంచనా. అయితే దానికీ కొంత ఖర్చు అవుతుంది కాబట్టి...అంతకంటే తక్కువ ధరకే నౌకను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. 


ఆకర్షణీయమైన ప్రాజెక్టుగా మార్పు


ఈ నౌకను విశాఖలో ఆకర్షణీయ ప్రాజెక్టుగా తయారు చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. డెక్‌పై రెండు రెస్టారెంట్లు ఏర్పాటుచేస్తారు. ఒక వైపు ‘డ్రింక్‌ అండ్‌ డైన్‌’ విధానంలో నిర్వహిస్తారు. అక్కడే డ్రింక్‌ చేసి, అక్కడే తినేలా ఏర్పాట్లు ఉంటాయి. మరోవైపు పూర్తిగా కుటుంబ సభ్యులంతా కూర్చొనేలా ఫ్యామిలీ రెస్టారెంట్‌ పెడతారు. నౌక పొట్ట భాగంలో ఎక్కువ స్థలం ఖాళీగా ఉంది. ఆ ప్రాంతాన్ని బర్త్‌డే పార్టీలు, రిసెప్షన్లు వంటివి నిర్వహించుకోవడానికి కన్వెన్షన్‌ సెంటర్‌లా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. 


ప్రత్యేకంగా బేస్‌ నిర్మాణం


తీరానికి కొట్టుకువచ్చిన నౌక మళ్లీ భారీ తుఫాన్లు వచ్చినప్పుడు లోపలకు కొట్టుకుపోవచ్చునని కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే అలాంటి అవకాశం లేదని, నౌక తెన్నేటి పార్కు సమీపాన రాళ్ల మధ్య ఇరుక్కుపోయిందని నిపుణులు స్పష్టంచేశారు. అది కదలకుండా వుండేందుకు సబ్‌మెరైన్‌ కురుసురకు ఎలాగైతే ఓ బేస్‌ నిర్మించారో దీనికి కూడా ఆ విధంగానే చుట్టూ పటిష్ఠమైన గోడలు నిర్మించి, కదలకుండా చేయాలంటున్నారు. నౌకలోకి వెళ్లడానికి హ్యాంగింగ్‌ మోడల్‌ రెయిలింగ్‌ నిర్మిస్తారు. ఆ ప్రాంతమంతా పర్యాటకుల రాకపోకలు, పార్కింగ్‌కు అనుకూలంగా మలుస్తారు. 


త్వరలోనే డీపీఆర్‌

రామ్‌ప్రసాద్‌, రీజనల్‌ డైరెక్టర్‌, పర్యాటక శాఖ

బంగ్లాదేశ్‌ నౌకను రెస్టారెంట్‌గా మార్చడానికి బేస్‌మెంట్‌ నిర్మిస్తే సరిపోతుంది. ముందు నౌకను కొనుగోలు చేస్తే...ఆ తరువాత ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో సమగ్ర నివేదిక ఇస్తామని ఏయూ మెరైన్‌ విభాగం ప్రొఫెసర్లు స్పష్టంచేశారు. అందుకని నౌక యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాం. వీలైనంత త్వరగా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుచేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది మంచి ప్రాజెక్టు అవుతుంది. 


Updated Date - 2020-12-20T06:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising