మలక్‌పేట ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు పెట్టాలి
ABN , First Publish Date - 2020-05-10T09:40:03+05:30 IST
అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తనపై మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ...
చాదర్‌ఘాట్ పీఎ్‌సలో బంగారు శ్రుతి ఫిర్యాదు
చాదర్‌ఘాట్, మే 9 (ఆంధ్రజ్యోతి): అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తనపై మలక్‌పేట ఎమ్మెల్యే బలాల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీజేపీ జాతీయ దళిత మోర్చా కార్యవర్గ సభ్యురాలు బంగారు శ్రుతి డిమాండ్ చేశారు. ఈ మేరకు చాదర్‌ఘాట్ ఠాణాలో ఇన్‌స్పెక్టర్ సతీశ్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు డాక్టర్ భగవంత్‌రావు, ఆలే జితేంద్ర తదితరులతో కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారని, అనంతరం తనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.