స్విమ్స్‌లో డయాలసిస్‌కు కొత్త మిషన్లు
ABN, First Publish Date - 2021-01-26T05:33:14+05:30
తిరుపతిలోని స్విమ్స్ నెఫ్రో ప్లస్ డయాలసిస్‌లో రోగుల సౌకర్యార్థం సోమవారం ఐదు కొత్త మిషన్లు అందుబాటులోకి వచ్చాయి.
తిరుపతి (వైద్యం), జనవరి 25: తిరుపతిలోని స్విమ్స్ నెఫ్రో ప్లస్ డయాలసిస్‌లో రోగుల సౌకర్యార్థం సోమవారం ఐదు కొత్త మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. డయాలసిస్ సమయంలో సోడియం బై కార్బొనేట్ నీళ్లలో కలిపి క్యాన్ల ద్వారా డయాలసిస్ చేసేవారు. గతంలో మాస్ సిబ్బంది ద్వారా ఈ సోడియం బై కార్బొనేట్ కలిపి వినియోగించేవారు. దీనివల్ల బాధితులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారని డయాలసిస్ వైద్యాధికారి డాక్టర్ నాగరాజు, నెఫ్రోప్లస్ ఇన్చార్జ్ ఆకాష్, చరణ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోడియం బై కార్బొనేట్‌ను మిషన్ల ద్వారా కలిపి రోగులకు అందించేలా కొత్త మిషన్లు అందుబాటులోకి వచ్చాయి.
Updated Date - 2021-01-26T05:33:14+05:30 IST