11న నేషనల్‌ మెగా లోక్‌ అదాలత

ABN , First Publish Date - 2021-09-05T05:37:21+05:30 IST

నేషనల్‌ మెగా లోక్‌అదాలత ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నామని దీనిని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌ఎ్‌సఏ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్‌ పిలుపునిచ్చారు.

11న నేషనల్‌ మెగా లోక్‌ అదాలత
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన జడ్జి పురుషోత్తం కుమార్‌

2,000 కేసుల పరిష్కారానికి చర్యలు

మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి పురుషోత్తంకుమార్‌

కడప రూరల్‌, సెప్టెంబర్‌ 4: నేషనల్‌ మెగా లోక్‌అదాలత ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నామని దీనిని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌ఎ్‌సఏ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఆవరణలోని డీఎల్‌ఎ్‌సఏ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసుల పరిష్కారంలో కడప జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 11న నిర్వహించే నేషనల్‌ మెగా లోక్‌ అదాలత్‌లో 2,000ల కేసుల పరిష్కారం లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 22 చెంచ్‌లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. లోక్‌ అదాలత్‌లో ఒకసారి కేసు పరిష్కారం అయితే సుంప్రీంకోర్టు తీర్పుతో సమానమన్నారు. తిరిగి అప్పీల్‌కు వెల్లడానికి వీలు పడదన్నారు. పైగా కక్షిదారులు ఇరువురు సమానంగా గెలిచినట్లేనన్నారు. లోక్‌ అదాలత్‌ పరిధిలోకి రాని కేసులంటూ ఏవీ లేవన్నారు. దీర్ఘకాలిక కేసులకు కూడా లోక్‌అదాలత్‌లో రాజీమార్గం ద్వారా చక్కటి పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇప్పటికే  కోర్టులలో దాఖలై విచారణకు వేచి ఉన్నవే కాక కోర్టులో దాఖలు కాని సమస్యలను కూడా లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. డీఎల్‌ఎ్‌సఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత మాట్లాడుతూ 11వ తేదీన నేషనల్‌ మెగా లోక్‌ అదాలత్‌ ఉదయం 10-30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. కడప బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సీతారామ్‌, జిల్లా మొదటి అదనపు జడ్జి శ్రీనివాస్‌ శివరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-05T05:37:21+05:30 IST