ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా గోదా దేవి కల్యాణం

ABN, First Publish Date - 2021-01-14T04:21:28+05:30

నిత్య కల్యాణం.. పచ్చతోరణం అన్నట్లుగా కోన పెంచల నృసింహుడికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ప్రతిరోజు శాస్త్రోక్తంగా కన్నులపండువగా జరుగుతుంది.

కోనలో పెంచలస్వామితో గోదాదేవి అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాదికి ఒకే ఒక్కరోజు అమ్మవారి కల్యాణం


రాపూరు జనవరి 13: నిత్య కల్యాణం.. పచ్చతోరణం అన్నట్లుగా కోన పెంచల నృసింహుడికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ప్రతిరోజు శాస్త్రోక్తంగా కన్నులపండువగా జరుగుతుంది. అయితే భోగిరోజు మాత్రం శ్రీవారి భక్తురాలు గోదాదేవి అమ్మవారిని స్వామివారు కల్యాణం చేసుకోవడం విశేషం.   క్షేత్రంలో భోగి పర్వదినం పురస్కరించుకుని పెంచలస్వామి భక్తురాలు గోదా అమ్మవారు కల్యాణాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి కల్యాణ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారితో గోదా అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.  పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద, పెంచలనామ స్మరణలు చేశారు. కోన భక్తులకు అన్నదానంతోపాటు ఉచిత ప్రసాదాలు అందించినట్లు ఈవో వెంకటసుబ్బయ్య తెలిపారు.


నేటి నుంచి సుప్రభాతసేవ

పెంచలకోన క్షేత్రంలో గురువారం నుంచి సుప్రభాతసేవ తిరిగి ప్రారంభం కానుంది. ధనుర్మానం నుంచి సుప్రభాతసేవను నిలిపివేసి తిరుప్పావై ఆలపిస్తారు. ఈ క్రమంలో ఽభోగి రోజు గోదాదేవి అమ్మవారితో శ్రీవారి కల్యాణం నిర్వహించారు. ధనుర్మాసం ముగియడంతో ఆలయంలో యధావిధిగా సుప్రభాతసేవ జరుగుతుంది. 

Updated Date - 2021-01-14T04:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising