ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్
ABN , First Publish Date - 2021-07-04T23:17:41+05:30 IST
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బేబీ
డెహ్రాడూన్: రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పుష్కర్ ఎంపికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, అందుకే పుష్కర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మరో నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సత్‌పాల్ మహారాజ్, హరక్ సింగ్ రావత్, వంశీధర్, యశ్‌పాల్ ఆర్య, బిషన్ సింగ్, సుబోథ్ ఉనియాల్, అరవింద్ పాండ్యే, గణేశ్ జోషి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.