LIVE: తిరుపతి, సాగర్, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
ABN, First Publish Date - 2021-05-02T14:20:18+05:30
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో వివిధ ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
హైదరాబాద్: ఐదు రాష్ట్రాలకు, దేశంలో వివిధ ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ప్రధానంగా ఏపీలో తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. అలాగే తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ రెండు ఎన్నికల్లో గెలుపు ఓటమలు ఎలా ఉన్నా మెజార్టీపైనే చర్చ నడుస్తోంది. తిరుపతి లోక్‌సభకు సంబంధించి వైసీపీ గెలుపు ఖాయమైనప్పటికీ ఎంత మెజార్టీ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు నాగార్జునసాగర్‌లో జరిగిన ఎన్నికలపై దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని చెప్పినప్పటికీ రెండు ఎగ్జిట్‌పోల్స్ మాత్రం హోరా హోరీ పోటీ ఉంటుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్ కూడా తమ గెలుపుపట్ల ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ గెలుస్తారని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాలతో పాటు, ఇటు తిరుపతి, నాగార్జునసాగర్ ఎన్నికల కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలపై ఏబీఎన్ చేపట్టిన చర్చలో సీపీఎం కందరాపు మురళి, సీనియర్ జర్నలిస్టు ఉప్పాల్ లక్ష్మణ్, టీఆర్‌ఎస్ నేత సీతారామ్ నాయక్, టీడీపీ నేత నెల్లూరు దుర్గాప్రసాద్, బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. చర్చను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
Updated Date - 2021-05-02T14:20:18+05:30 IST