గౌడ కులస్థులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి
ABN, First Publish Date - 2021-03-26T07:14:04+05:30
గౌడ కులస్థు లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గౌడ జనహక్కులపోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి న ర్సాగౌడ్ కోరారు.
నిర్మల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : గౌడ కులస్థు లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గౌడ జనహక్కులపోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి న ర్సాగౌడ్ కోరారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన గౌడ జన హక్కుల పోరా ట సమితి మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని.. మాట్లాడారు. గౌడ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని.. అందు వల్ల వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గౌడ కులస్థులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేకంగా 5వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. అలాగే గీత వృత్తికి గొడ్డలి పెట్టుగా ఉన్న జీవో ఎంఎస్ నంబరు 164ని వెంటనే తొలగించాలన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ గా పేరును నామకరణం చేయాలన్నారు. ఈ సమావేశంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి, జిల్లా అధ్యక్షుడు దొర రామాగౌడ్, నాయకులు రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-26T07:14:04+05:30 IST