లంకెబిందె లభ్యం
ABN , First Publish Date - 2021-04-09T05:28:43+05:30 IST
లంకెబిందె లభ్యం
- బయటపడిన 18.9 తులాల బంగారు, 1.2 కిలోల వెండి వస్తువులు
- సొత్తు విలువ రూ.9.5 లక్షలు
-1940ల కాలానికి చెందినవని అంటున్న పురావస్తు శాఖ అధికారులు
జనగామ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ ప్లాట్ల కోసం చదును చేస్తుండగా భూమి లోపల పాతి ఉంచిన లంకెబిందె బయటపడింది. ఈ బిందెలో 18.9 తులాల బంగారు, కిలో 200 గ్రాముల వెండి వస్తువులు లభించాయి. వీటి విలువ రూ.9.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సం ఘటన జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలో గురువారం ఉదయం జరిగింది. అధికారులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ మండలం పెంబర్తికి చెందిన సంకటి అయిలయ్య, సంకటి నర్సయ్య, సంకటి ప్రవీణ్, సంకటి పర్శరాములు, దేవరబోయిన యాదగిరి, దేవరబోయిన రాంచందర్, దేవరబోయిన సత్తయ్యతో పాటు మరో ఇద్దరు రైతులు మొత్తంగా 9 మంది తమకు చెందిన 11.20 ఎకరాల భూమిని 6 నెలల కిత్రం కీసర మండలం బోగారానికి చెందిన మెట్టు నర్సింహ, దుర్గాప్రసాద్, నాగరాజుకు అమ్మారు. ఈ క్ర మంలో భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్ చేయడం కోసం గురువా రం ఉదయం మెట్టు నర్సింహ పర్యవేక్షణలో జేసీబీతో చదును చేయడం ప్రారంభించారు. దీంతో లోపల పాతి పెట్టిన రాగిబిందె తగిలింది. శబ్దం రావడంతో జేసీబీ డ్రైవర్ దానిని బ యటకు తీస్తుండగా పగిలిపోయింది. అందులో ఆభరణాలు కనిపించడంతో జేసీబీ డ్రైవర్, స్థల యజమాని నర్సింహ ని వ్వెరపోయారు. వెంటనే నర్సింహ స్థానిక సర్పంచ్‌కు సమాచారం ఇచ్చాడు. స్థానికుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత బిందెను చేతిలోకి తీసుకొని పరిశీలించగా.. బంగా రు చెవి కమ్మలు, పుస్తెలు, వెండి కాలి పట్టీలతో పాటు ఇతర ఆభరణాలు కనిపించాయి. విషయం తెలిసిన వెం టనే పోలీసులు హుటాహుటిన రాగా, అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, ఏసీపీ వినోద్‌కుమార్, ఎమార్వో రవీందర్ చేరుకొని రాగిబిందెను పరిశీలించారు. కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు లంకెబిందె ను సీజ్ చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి పురావస్తు శాఖ అధికారులు వచ్చి లంకెబిందెను పరిశీలించారు. లంకెబిందెలో 18.9 తులాల బంగారు, కిలో 200 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి.
కాగా.. లంకెబిందె బరువు కిలో 700 గ్రాములు ఉందని అధికారులు తెలిపారు. లభించిన వాటి విలువ రూ.9.5 లక్షల వరకు ఉండవచ్చని వెల్లడించారు. లంకెబిందెతో పాటు ఆభరణాలను సీజ్ చేసి వరంగల్ ట్రెజరీ కార్యాలయానికి పంపించా రు. ఆభరణాలను బట్టి 1940కి కాలానికి చెందినవని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) రామూనాయక్ తెలిపారు. లంకెబిందెను చూడటానికి గ్రామస్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా, పురాతన లంకెబిందె ను ముట్టుకుంటే చెడు జరుగుతుందనే నమ్మకం ఉండటంతో.. దానిని ఎవరూ తా కలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామస్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాతే దాన్ని తాకారు. లంకెబిందెను ప్రత్యక్ష సాక్షి న ర్సింహ తాకిన వెంటనే ఆయనకు పూనకం వచ్చిందని స్థానికులు తెలిపారు.
కాగా, ఈ విషయమై ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ లంకెబిందెలో దొరికిన ఆభరణాల తీరును బట్టి అవి అత్యంత పురాతనమైనవి కావని తెలుస్తోందని చెప్పారు. బహుశా... ప్రైవేటు వ్యక్తులు తమ సొత్తును రక్షించుకునేందుకు భూమిలో పాతిపెట్టి ఉండవచ్చని, రాళ్లు ఉన్న ప్రాంతాన్ని అందుకు గుర్తుగా ఎంచుకున్నట్టుగా కనిపిస్తోందని తెలిపారు.