ఫ్యామిలీతో కలిసి జాలీగా..కవ్వాల్ అభయారణ్యంలో మంత్రి అల్లోల
ABN, First Publish Date - 2021-01-15T22:06:15+05:30
నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇందరకరణ్ రెడ్డి ఫ్రీ టైమ్‌లో కవ్వాల్ అభయారణ్యంలో ఫ్యామిలీతో సరదాగా గడిపారు.
హైదరాబాద్: నిత్యం తమ పనుల్లో బిజీబిజీగా గడిపే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇందరకరణ్ రెడ్డి ఫ్రీ టైమ్‌లో కవ్వాల్ అభయారణ్యంలో ఫ్యామిలీతో సరదాగా గడిపారు. కుటుంబంతో కలిసి కవ్వాల్ అభయారణాన్ని సందర్శించిన మంత్రి అక్కడ ఆహ్లాదంగా గడిపారు. ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఐ లవ్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ సింబల్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఫోటో దిగారు. అనంతరం కల్పకుంట్ల వాచ్‌టవర్ ఎక్కి వన్యప్రాణులను, అటవీ అందాలను వీక్షించారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర, వన్యప్రాణుల సంరక్షణపై మంత్రి తన మనమలు, మనమరాలికి అవగాహన కల్పించారు. తర్వాత గంగాపూర్ అటవీ ప్రాంతంలో పర్యటించారు. అంతకుముందు కుటుంబసమేతంగా కడెం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి రిజర్వాయర్‌లో బోటు షికారు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు.
Updated Date - 2021-01-15T22:06:15+05:30 IST