ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్‌ కార్యాలయ గుమ్మానికి తాళిబొట్టు!

ABN, First Publish Date - 2021-07-01T09:47:37+05:30

సిబ్బందికి లంచం ఇచ్చేందుకు డబ్బుల్లేవంటూ ఓ మహిళ తహసీల్‌ కార్యాలయ గుమ్మానికి తన తాళిబొట్టు కట్టి నిర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భూమి పట్టా ఇవ్వాలంటూ ఓ మహిళ నిరసన
  • సూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

రుద్రంగి/డిచ్‌పల్లి/సూర్యాపేట, జూన్‌ 30: సిబ్బందికి లంచం ఇచ్చేందుకు డబ్బుల్లేవంటూ ఓ మహిళ తహసీల్‌ కార్యాలయ గుమ్మానికి తన తాళిబొట్టు కట్టి నిరసన తెలిపింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్‌ కార్యాలయంలో బుధవారం జరిగింది. బాధితురాలు పొలాస మంగ తెలిపిన వివరాలు.. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన మంగ, రాజేశం దంపతులు. రాజేశం తండ్రి రాజలింగం పేరిట గ్రామం లో రెండెకరాల భూమి(సర్వే నెంబరు 130/14) ఉంది. అయితే, ఉపాధి కోసం 20 ఏళ్లక్రితం గల్ఫ్‌ వెళ్లిన రాజేశం తిరిగి రాలేదు. పట్టాదారు అయిన రాజలింగం 2013లో మరణించాడు. గ్రామంలో అప్పులు పెరగడంతో మంగ మెట్‌పల్లి పట్టణంలో ఉంటోంది. ఈ దశలో రాజలింగం పేరిట ఉన్న రెండెకరాల భూమి 2016లో మరో మహిళ పేరు మీదికి బదిలీ అయింది. 


విషయం తెలుసుకున్న మంగ ఆ భూమికి తన పేరిట పట్టా ఇవ్వాలంటూ రెండేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. లంచం ఇచ్చేందుకు తన వద్ద డబ్బులు లేవంటూ మంగ తన తాళిబొట్టును కార్యాలయ గుమ్మానికి కట్టి నిరసన తెలిపింది. అయితే, ఈ విషయమై తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌ఐ సునీత వివరణ ఇచ్చారు. మరోవైపు.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన రైతు మందడి రాంరెడ్డి 2011 నవంబరు 23న ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ఏపూరు గ్రామంలో 5 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం మూడేళ్లక్రితం దరఖాస్తు చేశా డు. అయితే, ఆ భూమి ఇతరుల పేరిట నమోదైందని, మార్పు చేయాల్సి ఉందంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదంటూ రాంరెడ్డి కలెక్టరేట్‌ ఎదుట పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు బాధితుడికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 


తహసీల్‌ కార్యాలయం ఎదుట రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణ 7 గుంట భూమిని ఏడాదిన్నర క్రితం గ్రామానికే చెందిన చిన్నోళ్ల సాయిలుకు రూ.2 లక్షలకు విక్రయించాడు. సాధ్యమైనంత త్వరగా డబ్బులు ఇస్తానంటూ సా యిలు తన పేరున భూమిని రిజిస్టర్‌ చేయించుకున్నాడు. తర్వాత సాయిలు డబ్బులు ఇవ్వకపోవడంతో నారాయణ అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో  నారాయణ తన భార్యతో కలిసి డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2021-07-01T09:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising