వాల్మీకులను దగా చేయొద్దు
ABN, First Publish Date - 2022-10-26T23:37:55+05:30
తరతరాలుగా అణగారిన వాల్మీకులను వైసీపీ మరోసారి దగా చేస్తోందని టీడీపీ వాల్మీకి సాధికారిక కమిటీ జిల్లా అధ్యక్షుడు బోయ రామాంజనేయులు ప్రభుత్వంపై మండిపడ్డారు.
టీడీపీ వాల్మీకి సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
కొత్తచెరువు(బుక్కపట్నం), అక్టోబరు 26: తరతరాలుగా అణగారిన వాల్మీకులను వైసీపీ మరోసారి దగా చేస్తోందని టీడీపీ వాల్మీకి సాధికారిక కమిటీ జిల్లా అధ్యక్షుడు బోయ రామాంజనేయులు ప్రభుత్వంపై మండిపడ్డారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కమిటీ వేయడంపై మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామంలో వాల్మీకి విగ్రహం వద్ద జిల్లా సాధికార కమిటీ ఆధ్వర్యంలో కొత్తచెరువు మండల వాల్మీకి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ...గతంలోనే టీడీపీ ప్రభుత్వం సత్యపాల్ కమిటీ ఏర్పాటుచేసి వాల్మీకుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ నివేదిక ఆధారంగానే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాల న్నారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని గత టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేయడం కేవలం కాలయాపన కోసమే అన్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం కొత్తచెరువు మండల నాయకులు రాజు, శ్రీనివాసులు, కొడపగానిపల్లి శివ, నారాయణస్వామి, లింగమయ్య, ఓబుళేశు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-26T23:37:58+05:30 IST