ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నక్యాంటీన్లు తొలగించి పేదల కడుపుకొట్టిన ప్రభుత్వం : టీడీపీ నాయకులు

ABN, First Publish Date - 2022-10-25T23:38:24+05:30

పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నక్యాంటీ న్లు ఏర్పాటు చేస్తే... వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని తొలగించి పేదల కడుపుకొట్టారని టీడీపీ ధర్మవరం నాయకులు విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరంరూరల్‌, అక్టోబరు25: పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నక్యాంటీ న్లు ఏర్పాటు చేస్తే... వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని తొలగించి పేదల కడుపుకొట్టారని టీడీపీ ధర్మవరం నాయకులు విమర్శించారు. టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ సూచనల మేరకు సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంఓని ఆర్టీసీ బ స్టాండ్‌ ఎదురుగా అన్నక్యాంటీన ద్వారా పేదలకు అన్నదానం చేశారు. వేలాదిమంది తరలివచ్చి ఉచిత భోజన సదుపాయాన్ని సద్విని యోగం చేసుకున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ది గాలికొదిలేసి ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తల పై క్షక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకోవడం వైసీపీ నీచరాజకీయాలకు నిదర్శన మని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అన్నక్యాంటీన ఏర్పాటుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ గొట్లూరు శ్రేణులను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి కమతంకాటమయ్య, నాయకులు పురుషోత్తంగౌడ్‌, పరిసే సుధాకర్‌, గొట్లూరు శ్రీనివాసులు, మాజీ సర్పంచ శివయ్య, అనిల్‌గౌడ్‌, తలారి నారాయణస్వామి, రజక శ్రీరాములు, బొంత చిరంజీవి, రఫీ, మల్లికార్జున, తలమర్ల వినోద్‌, అమరేంద్ర, భీమనేని ప్రసాద్‌, మారుతిస్వామి, చిన్నూరు విజయ్‌చౌదరి, అశోక్‌ వాల్మీకి, యుగంధర్‌, సాయినాథ్‌, తొగట అనిల్‌, రాంపురం శీన, గంగారపురవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-25T23:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising