రాష్ట్రపతి పర్యటనలో మంత్రి రోజాకు అవమానం

ABN , First Publish Date - 2022-12-05T18:18:29+05:30 IST

రాష్ట్రపతి పర్యటనలో మంత్రి రోజాకు అవమానం ఎదురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

రాష్ట్రపతి పర్యటనలో మంత్రి రోజాకు అవమానం

అమరావతి: రాష్ట్రపతి పర్యటనలో మంత్రి రోజాకు అవమానం ఎదురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రపతి పర్యటలో ఆమె ఒక ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు గుసగుసలు వినిపిస్తోన్నాయి. రాష్ట్రపతికి విడ్కోలు సభలో మంత్రి రోజా కనిపించలేదు. అయితే దీనికి కారణం... జిల్లాలో ఉన్న అంతర్గత పోరుతోనే కావాలనే ఆమెను పక్కన పెట్టారని చర్చించుకుంటున్నారు.

రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో ఆమె పర్యటించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టులో ద్రౌపదీ ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గన్నవరం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-12-05T18:22:21+05:30 IST