ఎట్టకేలకు.. ఉచిత బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2022-11-05T01:27:46+05:30 IST

కేంద్రం ప్రకటించిన మేర ఈనెల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శుక్రవారం 10వేల మెట్రిక్‌ టన్నుల నాన్‌-సార్టెక్స్‌ బియ్యాన్ని జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఎట్టకేలకు.. ఉచిత బియ్యం పంపిణీ

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 4: కేంద్రం ప్రకటించిన మేర ఈనెల ఉచిత బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శుక్రవారం 10వేల మెట్రిక్‌ టన్నుల నాన్‌-సార్టెక్స్‌ బియ్యాన్ని జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానమంత్రి గరీబ్‌కళ్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై)కు సంబంధించి ఉచిత బియ్యం పంపిణీ గడువు ముగిసింది. మళ్లీ అక్టోబరు నుంచి డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నవంబరు నుంచి పంపిణీకి సిద్ధమైంది. కేంద్రం సూచనల మేరకు మూడు నెలల కోటా పంపిణీ చేస్తుందో లేదో చూడాలి. ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏలోని 4,99,620 మంది కార్డుదారులకు.. ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కేజీల వంతున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు. దీనిపై మార్గదర్శకాలు రేపోమాపో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2022-11-05T01:27:50+05:30 IST