CM JAGAN: 32 మంది ఎమ్మెల్యేలకు సీరియస్ క్లాస్

ABN , First Publish Date - 2022-12-16T15:44:14+05:30 IST

దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు వెనుకంజలో ఉన్నట్లు తేటతెల్లం చేశారు. నివేదికలో వెనుకబడిన 32 మంది ఎమ్మెల్యేలు తమ పని తీరు మార్చుకోవాలని

CM JAGAN: 32 మంది ఎమ్మెల్యేలకు సీరియస్ క్లాస్
ఎమ్మెల్యేలకు సీరియస్ క్లాస్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (Chief Minister Jagan Mohan Reddy) సమక్షంలో జరిగిన ‘‘గడపగడపకు మన ప్రభుత్వం’’ వర్క్‌ షాప్ సమావేశం హాట్‌హాట్‌గా సాగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను సీఎం స్వయంగా వెల్లడిపరిచారు. దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు వెనుకంజలో ఉన్నట్లు తేటతెల్లం చేశారు. నివేదికలో వెనుకబడిన 32 మంది ఎమ్మెల్యేలు తమ పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మళ్లీ గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ (Gadapagadapaku mana prabhutvam Workshop) కార్యక్రమం 2023, మార్చి నెలలో నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆ సమయానికి వెనుకబడిన ఎమ్మెల్యేలంతా పని తీరు మార్చుకోవాలన్నారు. ఒకవేళ మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం జగన్ తేల్చిచెప్పేశారు. అలాగే వచ్చే వర్క్ షాప్‌లోనే పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడించబోతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

YS-1.gif

మంత్రుల తీరుపై కూడా అసంతృప్తి

మంత్రుల తీరుపై కూడా సీఎం జగన్(Cm jagan) అసంతృప్తి వ్యక్తం చేశారు. వెనుక బడిన 32 మంది జాబితాలో మంత్రులైన గుమ్మనూరు జయరాం. విడదల రజిని, జోగి రమేష్, సిదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నానాథ్ ఉన్నారు. ఈ వంద రోజులు పార్టీకి చాలా ముఖ్యమైన రోజులని సీఎం జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

JAG.gif

Updated Date - 2022-12-16T15:51:15+05:30 IST