Guntur: నక్క ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-12-17T11:35:12+05:30 IST
గుంటూరు: మాచర్ల (Macherla)లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బస్సులు కూడా మాచర్లకు రాకుండా అడ్డుకుంటున్నారు. బయట నుంచి ఎవరూ రాకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
గుంటూరు: మాచర్ల (Macherla)లో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. బస్సులు కూడా
రాకుండా అడ్డుకుంటున్నారు. బయట నుంచి ఎవరూ రాకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు (TDP Leaders House Arrest)లు చేస్తున్నారు. మాచర్ల వెళ్లకుండా పలువురు కీలక నేతలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల ఇళ్లవద్ద పోలీసులు మోహరించారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu) నివాసం దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న నక్కా ఆనందబాబుని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, నక్కా ఆనందబాబు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. చివరికి పోలీసుల వలయాన్ని చేధించుకుని గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
అటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ఇంటికీ వచ్చారు. సత్తెన్నపల్లిలో కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఛలో మాచర్లకు శివరాం పిలుపివ్వడంతో కార్యాలయానికి టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.