Vijayawada: కోవిడ్ పరిస్ధితులు.. సన్నద్దతపై మాక్ డ్రిల్
ABN , First Publish Date - 2022-12-27T12:25:21+05:30 IST
విజయవాడ: కొవిడ్ (covid)పై పోరుకు కేంద్రం రాష్ట్రాలను సన్నద్ధం చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని.. కోవిడ్ పరిస్ధితులు, సన్నద్దతపై మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది.
విజయవాడ: కొవిడ్ (covid)పై పోరుకు కేంద్రం రాష్ట్రాలను సన్నద్ధం చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని.. కోవిడ్ పరిస్ధితులు, సన్నద్దతపై మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జె.నివాస్ (J.Nivas) మాక్ డ్రిల్ నిర్వహించారు. కోవిడ్ వార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్ధితులను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాగా ఆంగ్ల సంవత్సరాది (New Year) వేడుకల నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.