ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న ఇళ్లకు తాళాలు..!

ABN, First Publish Date - 2022-07-30T06:12:56+05:30

జగనన్న ఇళ్లకు తాళాలు..!

v
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గృహ ప్రవేశం చేసుకున్న వారి ఆవేదన

నివాసయోగ్యం కాక తిరిగి అద్దె ఇళ్లకు వెళ్తున్న లబ్ధిదారులు

రెండు జిల్లాల్లో పూర్తయిన ఇళ్లు 8,200

4 వేల ఇళ్లకు పైగా తాళాలు

మౌలిక సదుపాయాలే ప్రధాన సమస్య


కోరి కట్టుకున్న ఇంటికి గృహప్రవేశం చేశాక కూడా.. తాళాలు వేసి అద్దె ఇళ్లలో ఉండటం ఎక్కడైనా చూశారా? మన జగనన్న కాలనీల్లో మాత్రం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. పేదవాడు శక్తికి మించిన వ్యయాన్ని భరించి, అందినకాడకు అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటే అద్దెల బాధైనా తగ్గుతుందనుకుంటే.. ఇంటికి తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రెండు జిల్లాల్లో 1,456 జగనన్న కాలనీల లే అవుట్లు ఉన్నాయి. వీటిలో 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా, 2.15 లక్షల మందిని తొలి విడత ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేశారు. రెండు జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని ఇళ్లే లక్ష వరకు ఉన్నాయి. ఎక్కువ భాగం ఇళ్లు బేస్‌మెంట్‌ దశలోనే ఉన్నాయి. శ్లాబ్‌ పోర్షన్‌ దశ వరకు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు చవిచూసి, ప్రభుత్వం సాయం అరకొరగా అందినా ‘ముందు ఇల్లు కట్టుకుంటే చాలు.. అద్దె భారం తప్పుతుంది.’ అని భావించి 8,200 మంది ఇళ్లు పూర్తి చేసుకున్నారు. వీరిలో సగభాగం గృహ ప్రవేశాలు కూడా జరుపుకొని మరుసటి రోజు నుంచే ఇళ్లకు తాళాలు వేసుకుని మళ్లీ అద్దె ఇళ్లకు వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 4,500 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిలో 2 వేలకు పైగా లబ్ధిదారులు ఇళ్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుపుకొని ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. కృష్ణాజిల్లాలో 3,700 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో వెయ్యిమందికి పైగా లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేసుకుని ఇళ్లకు తాళాలు వేసి, అద్దె ఇళ్లలో ఉంటున్నారు. 

కారణాలేంటి? 

లే అవుట్లలో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రెండు జిల్లాల్లోని 1,456                  లే అవుట్లలో చాలావరకు ఎటువంటి సదుపాయాలు లేవు. మోడల్‌ లే అవుట్లలోనూ అరకొరగానే కల్పించారు తప్ప పూర్తిస్థాయిలో ఎక్కడా లేవు. రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు, వరదనీటి మళ్లింపు కాల్వలు, విద్యుత్‌ వంటివి సమకూర్చలేదు. ఇళ్లు కట్టుకున్నా, ఎందుకు నివాసం ఉండట్లేదని లబ్ధిదారులను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా, విద్యుత్‌, మంచినీటి సదుపాయం కల్పించలేకేనని చాలామంది సమాధానం చెప్పారు. 85 శాతానికి పైగా లే అవుట్లలో విద్యుత్‌ కనెక్షన్‌ లేదు. 15 శాతం లే అవుట్లలో విద్యుత్‌ ఉన్నా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. విజయవాడ రూరల్‌ మండల పరిధిలోని జక్కంపూడి లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని, వైరింగ్‌ కూడా పూర్తి చేసుకుని విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామంలో ఇందిరమ్మ కాలనీ వెనుక ఉన్న లే అవుట్‌లో సింహభాగం ఇళ్లు పూర్తయ్యాయి. ఇందులో దాదాపు సగంమంది గృహ ప్రవేశాలు చేశాక తాళాలు వేశారు. ఈ కాలనీలోనూ విద్యుత్‌ పోల్స్‌ ఏర్పాటుచేసినా తీగలు వేయలేదు. ఉప్పులూరులో మరికొన్ని పెద్ద లే అవుట్లు ఉన్నాయి. వాటిలో విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటుచేసినా ఇళ్లు లేవు. ఇక రెండో ప్రధానమైనది మంచినీటి సమస్య. లే అవుట్లలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ద్వారా బోర్లు వేయించారు. ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. కొన్నిచోట్ల బోర్లు వేసినా నీరు రాని పరిస్థితి. ట్యాంకులు నిర్మించలేని దుస్థితి ఇంకోచోట. రోడ్లు, డ్రెయినేజీలు మరో ప్రధాన సమస్యగా ఉన్నాయి. వర్షం పడితే కాలనీలు బురదమయమవుతున్నాయి. నీరు నిల్వ ఉండిపోతోంది. రెండు జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలంటే రూ.1,500 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. పేదలకు విడతలవారీగా చెల్లించాల్సిన డబ్బుల విషయంలోనే చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు అంత వెచ్చిస్తుందో లేదో చూడాలి.





Updated Date - 2022-07-30T06:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising