టీడీపీకి అధికారం తథ్యం : రావి
ABN, First Publish Date - 2022-11-14T01:16:46+05:30
తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని, అధికారంలోకి రావడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. పర్నాస గ్రామం లో ఆదివారం రావి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది.
గుడివాడ రూరల్ : తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని, అధికారంలోకి రావడం తథ్యమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. పర్నాస గ్రామం లో ఆదివారం రావి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్నాస మాజీ సర్పంచ్ పల్లపోతు బసవయ్య, పల్లపోతు రాంబాబు, గంటా రాము, నల్లబ్బాయి తదితరులకు రావి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన జగన్ పరిపాలన నచ్చక పల్లపోతు బసవయ్య టీడీపీలో చేరారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయపతాక ఎగురవేయటం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో కనీస వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. సమస్యలను ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదని ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు వాసే మురళీ, ముళ్లపూడి రమేష్ చౌదరి, అంగడాల వీర్రాజు, చీకటి శేషగిరి, ముక్తినేని అమర్ బాబు, రేమల్లె రజని, అంగడాల శ్రీను, జానకి రామయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.
భట్లపెనుమర్రులో బాదుడే బాదుడు
కూచిపూడి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వర్ల కుమార్ రాజా పిలుపునిచ్చారు. భట్లపెనుమర్రు గ్రామంలో రెండో రోజైన ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిపి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. పార్టీ నేతలు మండవ శ్రీకృష్ణ, గొట్టిపాటి శ్రీధర్, చలసాని శ్రీనివాసరావు, పెన్మత్స నాగరాజు, అంగడాల రాఘవేంద్రరావు, గొట్టిపాటి అరవింద్, పెడసనగంటి రమేష్, మల్లిఖార్జునరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-14T01:16:48+05:30 IST