చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-11-08T22:18:39+05:30 IST

చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌నాయక్‌ పేర్కొన్నారు.

చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
మాట్లాడుతున్న సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌నాయక్‌

తోటపల్లిగూడూరు, నవంబరు 8 : చట్టాలను ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవని సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌నాయక్‌ పేర్కొన్నారు. మండలంలోని కోడూరు, పీడీకండ్రిగ, మహాలక్ష్మిపురం, గమళ్లపాలెం, ముత్యాలతోపు, ఎంజీకాలనీ, కోవూరు సచివాలయంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో హేమలత, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి లోక్‌అదాలత్‌ ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కంజి నీలమ్మ, లక్ష్మీ, ఆగాల శ్రీనివాసులురెడ్డి, కంజి శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T22:18:40+05:30 IST