Kinjarapu Rammohan: అందుకే మూడు రాజధానులాట
ABN , First Publish Date - 2022-11-19T21:55:17+05:30 IST
Amaravathi: ప్రజా సమస్యల పరిష్కరించలేక వారి దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్ తరుచుగా మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Amaravathi: ప్రజా సమస్యల పరిష్కరించలేక వారి దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్ తరుచుగా మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విశాఖలో రాజధానిని అక్కడి ప్రజలు కోరుకోవట్లేదని, ఉత్తరాంధ్రకు ఒక్క పైసా ఇవ్వకుండా రాజధాని తెస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. విశాఖలో మూడేళ్లలో 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని, వైసీపీ (YCP) నాయకులు భూములను ఇష్టానుసారంగా కొట్టేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్న జగన్ను జనం విశ్వసించరని, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.