Rammohan naidu: శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

ABN , First Publish Date - 2022-11-24T15:03:56+05:30 IST

శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

Rammohan naidu: శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్

శ్రీకాకుళం: శాశ్వత భూ హక్కు పథకం ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan naidu) విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... జగనన్న భూ హక్కు ఏమిటి?... జగన్ తాత, తండ్రి ఆస్తులు పంచుతున్నారా? అని ప్రశ్నించారు. సీఎంకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని అన్నారు. పాస్‌బుక్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అన్నిటిపైనా తన ఫోటో పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జిల్లాల పర్యటనలకు భయపడుతున్నారని అన్నారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. తెల్లవారితే భూములు ఎలా కబ్జా చేయాలన్న ఆలోచన తప్పా మరొకటి లేదని అన్నారు. మూడేళ్ళలో ఉత్తరాంధ్ర కు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో భారీ అవినీతి దాగి ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు (TDP MP) ఆరోపించారు.

Updated Date - 2022-11-24T15:08:22+05:30 IST