దక్షిణాదిలో దైకీ యాక్సిస్‌ ప్లాంట్‌

ABN , First Publish Date - 2022-12-21T04:11:22+05:30 IST

జపాన్‌ కేంద్రంగా పని చేసే దైకీ యాక్సిస్‌ దక్షిణ భారత్‌లో తన ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది...

దక్షిణాదిలో దైకీ యాక్సిస్‌ ప్లాంట్‌

  • రేసులో ఏపీ, తెలంగాణ

న్యూఢిల్లీ: జపాన్‌ కేంద్రంగా పని చేసే దైకీ యాక్సిస్‌ దక్షిణ భారత్‌లో తన ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో చర్చలు జరిపింది. దైకీ యాక్సిస్‌ ఇండియా సీఈఓ కమల్‌ తివారీ ఈ విషయం వెల్లడించారు. అనుమతులు లభిస్తే రూ.200 కోట్ల పెట్టుబడితే వచ్చే ఏడాదే ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. గృహోపయోగ వ్యర్థ జలాలను పునర్వినియోగానికి అనువుగా శుద్ధి చేయడంలో దైకీ యాక్సి్‌సకు మంచి అనుభవం ఉంది. ఈ కంపెనీకి ఇప్పటికే గుజరాత్‌, హరియాణ రాష్ట్రాల్లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. మూడో ప్లాంట్‌ దక్షిణ భారత్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.

Updated Date - 2022-12-21T04:11:26+05:30 IST