ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon chief Jeff Bezos: దేశ ఆర్థిక పరిస్థితులు బాగోలేదు

ABN, First Publish Date - 2022-11-19T02:03:44+05:30

అమెరికా అపర కుబేరులకు కూడా ఆర్థిక మాంద్యం భయం పట్టుకుంది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ బహిరంగంగానే ఈ భయం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్బులు దాచుకోండి.. కార్లు, టీవీలు కొనకండి..

అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌

న్యూయార్క్‌: అమెరికా అపర కుబేరులకు కూడా ఆర్థిక మాంద్యం భయం పట్టుకుంది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ బహిరంగంగానే ఈ భయం వ్యక్తం చేశారు. ఎడాపెడా అప్పులు చేసి చేతులు కాల్చుకోవద్దని అమెరికా కంపెనీలు, వినియోగదారులకు హితవు చెప్పారు. అమెరికా ప్రజల వ్యక్తిగత అప్పుల భారం ఇప్పటికే 16.5 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,348.05 లక్షల కోట్లు) చేరిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పు చేసి పప్పు కూడు తినే విధానం ఏ మాత్రం మంచిది కాదన్నారు.

వాయిదా వేసుకోండి

ఆర్థిక మాంద్యం పొంచి ఉన్నందున కొనుగోళ్లను కొద్ది నెలలు వాయిదా వేసుకోవడం మంచిదని బెజోస్‌ సూచించారు. సీఎన్‌ఎన్‌ చానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బెజోస్‌ ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదని అమెజాన్‌ చీఫ్‌ అన్నారు. ‘జీడీపీ వృద్ధి రేటు పడిపోతోంది. అనేక రంగాల్లో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు’ అన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని అప్పు చేసి కార్లు, పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్‌లు కొనే ఆలోచనల్ని కొద్ది నెలలు వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. పరిస్థితులు కుదుటపడే వరకు వ్యాపార సంస్థలూ విస్తరణ ప్రణాళికలు పక్కన పెట్టాలని సూచించారు.

వచ్చే ఏడాదీ కొలువుల కోతలు

మరోవైపు అమెజాన్‌లో ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాదీ కొనసాగనున్నాయి. కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ఈ విషయం ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేదంటూ అమెజాన్‌ కొద్ది రోజుల క్రితమే 11,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. సీఈఓ తాజా ప్రకటనతో అమెజాన్‌లో ఇంకా ఉన్న ఉద్యోగులకూ తీసివేతల భయం పట్టుకుంది.

Updated Date - 2022-11-19T08:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising