‘పవర్‌ మెక్‌’కు ఖాజీపేట వ్యాగన్‌ రిపేర్‌ వర్క్‌ షాప్‌ కాంట్రాక్ట్‌

ABN , First Publish Date - 2022-12-27T05:22:28+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ కొత్తగా రూ.1,034.13 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది...

‘పవర్‌ మెక్‌’కు ఖాజీపేట వ్యాగన్‌ రిపేర్‌ వర్క్‌ షాప్‌ కాంట్రాక్ట్‌

  • ఆర్డర్‌ విలువ రూ.307 కోట్లు

  • అదానీ నుంచి రూ.608 కోట్ల ఆర్డర్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ కొత్తగా రూ.1,034.13 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. ఇందులో రూ.306.60 కోట్ల పెట్టుబడి అంచనాతో తెలంగాణలోని ఖాజీపేట వద్ద ఏర్పాటు చేయనున్న వ్యాగన్‌ రిపేర్‌ వర్క్‌షాప్‌ ఒకటి. పవర్‌మెక్‌, తైకిషా జాయింట్‌ వెంచర్‌ కంపెనీ అయిన తైకిషా ఇంజనీరింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ వర్క్‌షాప్‌ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపింది. ఇంకో ఆర్డర్‌ కింద మధ్యప్రదేశ్‌, చత్తీ్‌సగఢ్‌లోని రెండు అదానీ థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు ‘ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌ (ఎఫ్‌జీడీ) యంత్ర పరికరాలు సరఫరా చేస్తుంది. ఈ ఆర్డర్‌ విలువ రూ.608 కోట్ల వరకు ఉంటుందని పవర్‌ మెక్‌ తెలిపింది. మూడో ఆర్డర్‌ కింద నైజీరియాలోని ఒక పెట్రో రసాయనాల ప్రాజెక్టుకు నిర్వహణ, ఆపరేషన్‌ సేవలు అందిస్తుంది. ఈ ఆర్డర్‌ విలువ రూ.119.53 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది.

Updated Date - 2022-12-27T05:22:30+05:30 IST