HealthifyMe study : దీపావళి తరువాత ఆడవారి కంటే మగవాళ్ళు అధికంగా బరువు పెరిగారా..?
ABN, First Publish Date - 2022-11-25T14:34:14+05:30
మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ చక్కెరను ఇష్టపడతారని కూడా అధ్యయనంలో తేలింది.
ఈ సంవత్సరం, కోవిడ్ తరవాత వచ్చిన దీపావళి పండుగ మనందరికీ చాలా ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా మనలో చాలామంది తీపి పదార్థాలతో దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండుగ సమయంలో భారతీయులు తీసుకునే స్వీట్స్ గురించి హెల్త్ అండ్ ఫిట్‌నెస్ యాప్ HealthifyMe ఒక నివేదికను బయటపెట్టింది. మొత్తం చక్కెర వినియోగం ఈ ఏడాది గరిష్ఠ స్థాయిలో 32 శాతంగా నమోదైందట.
మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ చక్కెరను ఇష్టపడతారని కూడా అధ్యయనంలో తేలింది. పండుగ వారంలో పురుషుల్లో చక్కెర వినియోగం 38 శాతం పెరగగా, మహిళల్లో ఇది 25 శాతంగా ఉంది. ఒక వారంలో స్త్రీల కంటే పురుషులు ఎక్కువ బరువు పెరగడానికి సరైన కారణాల్లో సరైన వ్యాయామం లేకపోవడంతో పాటు షుగర్ సమస్యలు కూడా కారణం. దీపావళి వారంలో పురుషులు సగటున 1.7 కిలోల బరువు ఉండగా, మహిళలు 1.28 కిలోలు పెరిగారు.
భారతదేశం మొత్తంలో, పూణేలో చక్కెర వినియోగం అత్యధికంగా ఉంది, ఇక్కడ పండుగ వారంలో ప్రజలు 46 శాతం పెరిగారు. బెంగళూరు 34 శాతం, హైదరాబాద్ 34 శాతం, చెన్నై 33 శాతం మిఠాయిలు, డెజర్ట్‌లను ఎక్కువగా తిన్నవారిలో ఈ బరువు పెరిగే సమస్య అధికంగా ఉంది. ఢిల్లీ, కోల్‌కతాలో స్వీట్ తీసుకోవడం వరుసగా 30 శాతం నుంచి 27 శాతం పెరిగింది. ముంబైలోని ప్రజలు కేవలం 20 శాతం పెరుగుదలతో వెనకబడి ఉన్నారు.
మహారాష్ట్రీయుల తర్వాత ఢిల్లీ వాసులు 1.5 కిలోలు, హైదరాబాదీలు 1.2 కిలోల బరువు పెరిగారు. బెంగుళూరు వాసులు, చెన్నై వాసులు వారంలో సగటున కేవలం 0.9 కిలోల బరువు పెరగడంతో దక్షిణాది మరింత ప్రభావంగా ఉన్నారు. పండుగ సీజన్‌లో అక్టోబరు 28 , నవంబర్ 3 మధ్య సగటు చక్కెర వినియోగం 30 శాతం తగ్గింది. తిరిగి శారీరక శ్రమలు కూడా 12 శాతం పెరిగాయి. దీపావళి తర్వాత పది రోజుల్లో సగటు బరువు తగ్గడం 1.2 కిలోలు. మహిళలు 1.1 కిలోల బరువు తగ్గగా, పురుషులు సగటున 1.4 కిలోల బరువు తగ్గారు. అధికంగా చక్కెర వినియోగించడం వల్ల దీర్ఘకాలికంగా వ్యాధులు వేధించే అవకాశం ఉంది. స్వీట్ తీసుకునే ప్రతి ఒక్కరిలోనూ ఈ ప్రభావం కనిపిస్తుంది
Updated Date - 2022-11-25T14:40:55+05:30 IST