Healthier Heart: ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారాలు..!
ABN, First Publish Date - 2022-11-18T15:37:30+05:30
సమతుల్య ఆహారంతో,హృదయ సంబంధ వ్యాధులు, సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఆహారాన్ని మార్చుకోవడమే మార్గం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ సూపర్‌ఫుడ్‌లు సహాయపడతాయి. సమతుల్య ఆహారంతో,హృదయ సంబంధ వ్యాధులు, సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి, ఆరోగ్యవంతమైన గుండె కోసం ఏ ఆహారాలను తీసుకోవాలో చూడండి!
ఆరెంజ్..
ఉదయం పూట ఆరెంజ్‌లు తీసుకుంటే విటమిన్ సి నిండి ఉంటుంది. అన్ని రకాల ఖనిజాలు, పోషకాలను కూడా అందుతాయి. ఆరెంజ్, పొటాషియం, పెక్టిన్‌తో సహా చాలా రుచికరమైన చిరుతిండి అందినట్టే..
కాలే
క్యాబేజీ కుటుంబం విషయానికి వస్తే, కాలే ఖచ్చితంగా పోషకాల పరంగా అగ్ర రకాల్లో ఒకటి. ఈ ఆకుకూరలు కేవలం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ మెదడు శక్తిని పెంచుతాయి. వాపును తగ్గిస్తాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి చాలా ఘాటైనది ఇది అందరికీ ఉపయోగపడదు, కానీ కొద్ది మొత్తంలో వెల్లుల్లిని తీసుకుంటే అది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా దోహదపడుతుంది. రక్తపోటును మెరుగుపరచడానికి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
టమాటో
టమాటోలలో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ పండ్లకు ప్రత్యేకమైన ఎరుపు రంగును ఇస్తుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లైకోపీన్ కణాలను బలోపేతం చేయడం, LDL కొలెస్ట్రాల్ తగ్గించడం, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది.
ఖర్జూరం..
ఖర్జూరం, పండు, గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్‌లతో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగిస్తారు.
రెడ్ వైన్
రెడ్ వైన్ విషయానికి వస్తే, రెడ్ వైన్ ప్రత్యేకంగా నరాలకు ఉపశమనం కలిగిస్తుంది, LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది రక్తపోటును, స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధికంగా తీసుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.
Updated Date - 2022-11-18T15:50:38+05:30 IST