WHO:కొవిడ్ పరిస్థితిపై నిర్దిష్ట సమాచారం ఇవ్వండి..చైనాను కోరిన డబ్ల్యూహెచ్ఓ
ABN, First Publish Date - 2022-12-31T06:29:35+05:30
కరోనా మహమ్మారి మరోసారి ప్రబలుతున్న నేపథ్యంతో చైనా దేశానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ఆదేశాలు...
జెనీవా: కరోనా మహమ్మారి మరోసారి ప్రబలుతున్న నేపథ్యంతో చైనా దేశానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.(China) చైనా దేశంలో కొవిడ్ పరిస్థితులపై నిర్దిష్ట సమాచారాన్ని క్రమం తప్పకుండా పంపించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) ఆ దేశాన్ని కోరింది. కొవిడ్ తో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య, కరోనా మరణాలు, టీకాలపై డేటాను పంచుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ చైనా అధికారులకు సూచించింది.(COVID-19 situation)
చైనా దేశంలో జీరో కొవిడ్ విధానాన్ని సడలించిన దృష్ట్యా ఆ దేశంలో తక్కువ పరీక్షలు చేస్తున్నందున అధికారిక కొవిడ్ కేసుల గణాంకాలు నమ్మదగినవి కావని ఆరోగ్యసంస్థ పేర్కొంది. జనవరి 3వతేదీన జరగనున్న డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమావేశంలో వైరల్ సీక్వెన్సింగ్ పై డేటాను(Specific Data Regularly) సమర్పించాలని చైనా శాస్త్రవేత్తలను ప్రపంచ ఏజెన్సీ కోరింది.చైనాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా, భారతదేశం, ఇటలీ, జపాన్, తైవాన్, చైనా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశాయి.
Updated Date - 2022-12-31T07:35:14+05:30 IST