బీజేపీవి విద్వేష రాజకీయాలు
ABN, First Publish Date - 2022-09-30T06:46:48+05:30
జేపీ, ఆర్‌ఎ్‌సఎస్ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం సాయంత్రం తమిళనాడులోని నీలగిరి జిల్లా
జీఎస్టీతో జేబులు లూటీ: రాహుల్
చెన్నై, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం సాయంత్రం తమిళనాడులోని నీలగిరి జిల్లా గూడలూరులోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ అనేక రాష్ట్రాల సమ్మేళనమే భారతదేశమని, ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను గౌరవించాల్సిందేనన్నారు. కేంద్రం నియమించిన గవర్నర్లు బీజేపీయేతర రాష్ట్రాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. ‘వారిని ఆయా రాష్ట్రాల ప్రజలు ఎన్నుకున్నారా?’ అని నిలదీశారు. ‘జీఎస్టీని రాష్ట్రాలకు నిర్ణీత సమయంలో ఎందుకు బట్వాడా చేయడం లేదు? ఇది ప్రజల డబ్బు. ఇందులో అన్ని రాష్ట్రాలకూ భాగస్వామ్యం ఉంది’ అన్నారు. దేశ ప్రజలపై ఒకే భాషను బలవంతంగా రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు.
Updated Date - 2022-09-30T06:46:48+05:30 IST