School Teachers: స్కూలు ఉపాధ్యాయులకు విమానాశ్రయంలో కొవిడ్ డ్యూటీ

ABN , First Publish Date - 2022-12-27T07:25:27+05:30 IST

పాఠశాల ఉపాధ్యాయులకు విమానాశ్రయంలో కొవిడ్ విధులు అప్పగించడంపై వివాదం రాజుకుంది....

School Teachers: స్కూలు ఉపాధ్యాయులకు విమానాశ్రయంలో కొవిడ్ డ్యూటీ
School Teachers Covid Duty

న్యూఢిల్లీ: పాఠశాల ఉపాధ్యాయులకు విమానాశ్రయంలో కొవిడ్ విధులు అప్పగించడంపై వివాదం రాజుకుంది.(Govt School Teachers) దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో (Delhi)ప్రభుత్వ పాఠశాలలకు జనవరి 1 నుంచి 15వతేదీ వరకు సెలవులు ప్రకటించడంతో ఆయా పాఠశాలలకు చెందిన 85 మంది ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్ నిర్ధారణకు అదనపు సిబ్బందిగా నియమించారు.(Deployed at IGI Airport)ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి పెరిగిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు కొవిడ్ విధులు(Covid Duty) అప్పగించారు.

జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తరపున జిల్లా మేజిస్ట్రేట్, వెస్ట్, కొవిడ్ ప్రోటోకాల్‌ను నిర్ధారించడానికి విమానాశ్రయంలో అదనపు సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమిస్తూ ఆర్డర్ జారీ చేశారు.ఉత్తర్వు ప్రకారం ఉపాధ్యాయులు విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు కొవిడ్ ప్రోటోకాల్ విధిని నిర్ధారించాలి.కొవిడ్ ప్రబలుతున్నందున ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసింది.

కొవిడ్ ఔషధాల సేకరణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.104కోట్ల బడ్జెట్ ను ఢిల్లీ సర్కారు విడుదల చేసింది. ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో పాటు ఆసుపత్రుల డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ నిధులను కేటాయించారు.

Updated Date - 2022-12-27T07:25:28+05:30 IST