ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamil Nadu : గవర్నర్‌ను తక్షణం తొలగించండి... రాష్ట్రపతికి డీఎంకే లేఖ...

ABN, First Publish Date - 2022-11-09T12:01:32+05:30

తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tamil Nadu Governor RN Ravi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రశాంతతకు ముప్పు అని ఆరోపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు సేవలందించకుండా ఆయన అడ్డుకుంటున్నారని మండిపడింది. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu)కు ఓ వినతిపత్రాన్ని పంపించింది.

ఆర్ఎన్ రవి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేటపుడు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని ప్రమాణం చేశారని, ఆ ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘిస్తున్నారని ద్రౌపది ముర్ముకు సమర్పించిన వినతిపత్రంలో డీఎంకే ఆరోపించింది. ఆయన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంది. శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని తెలిపింది.

ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిలించే విధంగా ఆయన మాట్లాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలను రాజద్రోహంగా కొందరు పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. రాజ్యాంగ పదవికి ఆయన అనర్హుడని పేర్కొంది. ఆయన ఉద్వాసనకు తగినవారని తెలిపింది. ఈ మెమెరాండంపై డీఎంకే అధిష్ఠాన వర్గం నేతలు, ఆ పార్టీ మిత్ర పక్షాల నేతలు సంతకాలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఈ మెమొరాండంను ఈ నెల 2న రాసినట్లు సమాచారం.

డీఎంకే (DMK) ఇటీవల భావసారూప్యతగల ఎంపీలకు ఓ లేఖ రాసింది. రవిని గవర్నర్ పదవి నుంచి తొలగించాలనే తమ ప్రతిపాదనకు మద్దతివ్వాలని కోరింది.

ఇదిలావుండగా, గవర్నర్ రవి ఈ పరిణామాలపై స్పందించలేదు. తమిళనాడులో 20 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపవలసి ఉంది.

కేరళ, తెలంగాణా రాష్ట్రాల గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య కూడా జగడాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2022-11-09T12:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising