ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uniform civil code: గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2022-10-29T17:50:23+05:30

గుజరాత్‌ లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: గుజరాత్‌ (Gujarat)లోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform) అమలుకు సంబంధించి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం శనివారం ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వి (Harsh sangvi) తెలిపారు. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులు ఉంటారని కేంద్ర మంత్రి పర్సోత్తమ్ రూపాల తెలిపారు. ప్రధాన నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నాయకత్వంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పాటేల్ శనివారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు సంఘ్వి చెప్పారు. గుజరాత్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఉమ్మతి పౌరస్మృతి అమలు అవసరాన్ని కమిటీ పరిశీలించి, ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేస్తుందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఒక ట్వీట్‌లో తెలిపారు.

Updated Date - 2022-10-29T17:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising