Nasal vaccine: కరోనా బీఎఫ్7 వేరియంట్ ముప్పు...నాసికా వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి

ABN , First Publish Date - 2022-12-23T11:51:54+05:30 IST

కరోనా బీఎఫ్7 వ్యాప్తి నేపథ్యంలో దీని కట్టడికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

Nasal vaccine: కరోనా బీఎఫ్7 వేరియంట్ ముప్పు...నాసికా వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి
India Approves Nasal Vaccine

న్యూఢిల్లీ: కరోనా బీఎఫ్7 వ్యాప్తి నేపథ్యంలో దీని కట్టడికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కొత్త ప్రపంచవ్యాప్తంగా కరోనా బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలో నాసికా వ్యాక్సిన్ కు( Nasal Vaccine) కేంద్రప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది.(India Approves) ఈ వ్యాక్సిన్ హెటెరోలాగస్ బూస్టర్‌గా ఉపయోగ పడనుంది. నాసికా వ్యాక్సిన్ శుక్రవారం కో-విన్ పోర్టల్‌కు జోడించనున్నట్లు కేంద్రం తెలిపింది. కరోనావైరస్(Covid) కోసం నాసల్ వ్యాక్సిన్ శుక్రవారం నుంచి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచారు.

రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కేంద్రం సూచించింది.అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొవిడ్(Corona virus) కట్టడికి నిఘా చర్యలు చేపట్టారు.చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఇటీవలి కాలంలో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

Updated Date - 2022-12-23T11:51:56+05:30 IST