ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Covid: కరోనా వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2022-12-26T21:28:04+05:30

కరోనా(Corona) భయాందోళనలు మళ్లీ మొదలైన వేళ కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) కీలక

Karnataka Covid
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా(Corona) భయాందోళనలు మళ్లీ మొదలైన వేళ కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, బీఎఫ్.7 (BF.7) వేరియంట్ భయపెడుతుండడమే తాజా మార్గదర్శకాలకు కారణం. రెస్టారెంట్లు పబ్‌లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలు వంటి మూసి ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. కొత్త సంవత్సరం వేడుకలు రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశించింది.

అయితే, అంతమాత్రాన భయపడాల్సింది ఏమీ లేదని, కాకపోతే ఇప్పటి నుంచే జాగ్రత్త చర్యలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ తెలిపారు. గర్భిణులు, చిన్నారులు, పెద్దలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జనసమ్మర్ధ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వేడుకలు జరిగే చోట పరిమితికి మించి జనాన్ని అనుమతించవద్దని పేర్కొంది. స్కూళ్లలో శానిటైజర్లను ఉపయోగించడం, మాస్కులు ధరించేలా చూడాలని, టీకాలు పూర్తిగా తీసుకోవడం తప్పనిసరని తెలిపింది.

Updated Date - 2022-12-26T21:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising