ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మమత భేటీ

ABN, First Publish Date - 2022-11-03T04:31:33+05:30

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. బుధవారం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజకీయాలు మాట్లాడలేదని వెల్లడి

చెన్నై, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం స్టాలిన్‌తో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. బుధవారం ఆళ్వారుపేటలోని స్టాలిన్‌ నివాసానికి వచ్చిన మమతను సోదరి కనిమొళి, సీనియర్‌ నేత టీఆర్‌ బాలు తదితరులతో కలసి సాదరంగా ఆహ్వానించారు. సుమారు 45 నిమిషాల పాటు అక్కడున్న మమత స్టాలిన్‌తో ఏకాంతంగా చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ ఇలగణేశన్‌ కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చానన్నారు. చెన్నై వస్తే తన సోదర సమానుడైన స్టాలిన్‌ను కలుసుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. ఇద్దరు రాజకీయ నేతలు సమావేశమైనప్పుడు రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన రావడం సహజమేనన్నారు. అయితే ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని, ఎన్నికలపైనా ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అంతకుముందు స్టాలిన్‌ మాట్లాడుతూ.. ఇది రాజకీయ భేటీ కాదని, కేవలం మర్యాద పూర్వక భేటీయేనన్నారు.

Updated Date - 2022-11-03T04:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising