2024 LS polls: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-12-27T20:31:36+05:30
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓ భారీ కూటమికి ఏఐఏడీఎంకే (AIADMK) నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ తాత్కాలిక
చెన్నై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓ భారీ కూటమికి ఏఐఏడీఎంకే (AIADMK) నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి కే పళనిస్వామి (Edappadi K Palaniswami) అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పని చేయాలని ఆ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2023వ సంవత్సరం ఏఐఏడీఎంకేకు చాలా ముఖ్యమైనదని మరో నేత డి జయకుమార్ తెలిపారు.
ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో మంగళవారం పళనిస్వామి మాట్లాడుతూ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం ఓ మెగా కూటమికి తమ పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తమ పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. 2023వ సంవత్సరం ఏఐఏడీఎంకేకు చాలా ముఖ్యమైనదని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించాలని కోరారు. రాజకీయంగా మనకు పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐఏడీఎంకే సీనియర్ నేతలు, వివిధ జిల్లాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి జయ కుమార్ మాట్లాడుతూ, తాము పన్నీర్‌సెల్వం (O Panneerselvam), శశికళ (VK Sasikala), దినకరన్ (TTV Dhinakaran)ల గురించి చర్చించలేదని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడం, డీఎంకే (DMK)ను ఓడించడం మాత్రమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.
Updated Date - 2022-12-27T20:31:39+05:30 IST