ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adar Poonawalla: కోవిడ్ భయాందోళనలు వద్దు

ABN, First Publish Date - 2022-12-21T15:42:35+05:30

పొరుగున ఉన్న చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ భారతీయులు మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పొరుగున ఉన్న చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ భారతీయులు మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawala) తెలిపారు. ఇండియా సాధించిన అద్భుతమైన వ్యాక్సినేషన్ కవరేజ్, ట్రాక్ రికార్డు కారణంగా ప్రజలు ఆందోళన చెందనక్కరలేదని అన్నారు. అయితే ఇదే సమయంలో భారత ప్రభుత్వం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని సూచించారు. కొవిషీల్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారు చేసిన సీరుం ఇన్‌స్టిట్యూట్ సీఈఓగా పునావాలా ఉన్నారు.

చైనా ఏమంటోంది?

హాంగ్‌కాంగ్ పోస్ట్ కథనం ప్రకారం, చైనాలో లెక్కకు మించి కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అధికారిక లెక్కలు మాత్రం రోజుకు 2,000 కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. చైనాలో కోవిడ్ కేసుల విజృంభణపై భారత మాజీ రాయబారీ కేపీ ఫెబియన్ మాట్లాడుతూ, ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా చైనాలో ఉందని, అక్కడ 60 శాతం ప్రజలు కోవిడ్ బారిన పడి, లక్షలాది మంది మరణించే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే, అందులో 10 శాతం జనాభా చైనాలో ఉందని, అది పెద్ద సంఖ్యేనని అన్నారు. నిపుణులు చెబుతున్నది సరైనదో కాదో ప్రస్తుతం తాను చెప్పలేనని, చైనాలో కోవిడ్‌తో పోరాటం విషయంలో వారి వ్యాక్సిన్‌లో ఎక్కడా పొరపాటు దొర్లినట్టు ఉందన్నారు. మరింత మెరుగైన వ్యాక్సిన్ తెప్పించుకునేందుకు, సొంత వ్యాక్సిన్స్ మెరుగు పరుచుకునేందుకు చైనా నిరాకరిస్తున్నట్టు కనిపిస్తోందని చెప్పారు.

కాగా, ఇటీవల పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారంనాడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కోవిడ్ పాజిటివ్ కేసుల శాంపుల్స్‌‍ను ఇన్సాకాగ్ (INSACOG) ల్యాబ్‌లకు పంపాలని, కొత్త వేరియంట్లు ఉన్నాయా అనేది ఇందువల్ల తెలుసుకునే వీలుంటుందని తెలిపింది. పరిస్థితిని ఇన్సాకాగ్ నిశితంగా గమినిస్తోంది.

Updated Date - 2022-12-21T15:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising