CoronaVirus: కరోనా వైరస్‌పై నిజం చెప్పేసిన వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త.. వెలుగులోకి వాస్తవం!
ABN, First Publish Date - 2022-12-05T20:22:30+05:30
కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తికి కారణమైందని భావిస్తున్న చైనాలోని (China) వివాదాస్పద ‘వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ ల్యాబ్‌లో (Wuhan) పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమిలాజిస్ట్, రీసెర్చర్ ఆండ్ర్యూ హుఫ్స్ (Andrew Huff) నిర్ఘాంతపోయే నిజాన్ని బయటపెట్టారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తికి కారణమైందని భావిస్తున్న చైనాలోని (China) వివాదాస్పద ‘వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ ల్యాబ్‌లో (Wuhan) పనిచేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమిలాజిస్ట్, రీసెర్చర్ ఆండ్ర్యూ హుఫ్స్ (Andrew Huff) నిర్ఘాంతపోయే నిజాన్ని బయటపెట్టారు. కొవిడ్-19 (Covid-19) మనిషి తయారు చేసిన వైరస్ అని, వూహాన్ (Wuhan) ల్యాబ్ నుంచి ఇది లీకైందని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఆయన రాసిన ‘ది ట్రూత్ అబౌట్ వూహాన్’ అనే పుస్తకంలో ఈ విషయాలను ప్రస్తావించారు. చైనాలోని కరోనా వైరస్‌లపై అధ్యయనానికి అమెరికా ఫండింగ్ చేస్తుండడమే వైరస్ పుట్టుకకు కారణమని శాస్త్రవేత్త పేర్కొన్నట్టు బ్రిటీష్ న్యూస్ పేపర్ ‘ది సన్’ (The Sun) ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వ ఆధీనంలోని వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV) నుంచి కొవిడ్ వైరస్ లీకయ్యిందంటూ రెండేళ్లక్రితం ‘న్యూయార్క్ పోస్ట్’ ప్రచురించిన కథనాన్ని ఆయన ప్రస్తావించారని పేర్కొంది. తగిన భద్రత తీసుకోకుండానే ప్రయోగాలు నిర్వహించారని, తత్ఫలితంగానే వైరస్ లీకయ్యిందని శాస్త్రవేత్త పేర్కొన్నట్టు తెలిపింది.
కాగా శాస్త్రవేత్త ఆండ్ర్యూ హుఫ్స్ న్యూయార్క్ కేంద్రంగా అంటువ్యాధులపై అధ్యయనం నిర్వహించే స్వచ్ఛంధ సేవాసంస్థ ఎకోహెల్త్ అలయెన్స్‌కు మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారని న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ పేర్కొంది. కాగా కరోనా వ్యాప్తి వ్యూహాన్ ల్యాబే మూలకారణమంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వాధికారులతోపాటు వూహాన్ ల్యాబ్ సిబ్బంది కూడా కొట్టివేసిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-12-05T20:26:10+05:30 IST