యూరప్ నగరాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు ఎన్నారై టీడీపీ భారీ ఏర్పాట్లు
ABN, First Publish Date - 2022-04-19T18:35:34+05:30
యూరప్‌లోని వివిధ నగరాలలో గత నెలలో టీడీపీ 40వ వార్షికోత్సవాలను ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: యూరప్‌లోని వివిధ నగరాలలో గత నెలలో టీడీపీ 40వ వార్షికోత్సవాలను ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బర్త్‌డే వేడుకలను అదే స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూరప్‌లోని ప్రధాన నగరాల్లో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఎన్నారైలు పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించగా.. ఆ తర్వాత పార్టీని మరింత బలోపేతం చేసి, జాతీయస్థాయికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనని ఎన్నారైలు అన్నారు. అందుకే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిటనట్లు ఎన్నారై టీడీపీ యూరప్ సెల్ తెలిపింది. ఇక తాము నిర్వహించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వచ్చినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని టీడీపీ సీనియర్ లీడర్, ఎన్నారై గుంటుపల్లి జయకుమార్ అన్నారు. కాగా, చంద్రబాబు బుధవారం(ఏప్రిల్ 20) నాడు 72వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.
Updated Date - 2022-04-19T18:35:34+05:30 IST