ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visit visa: సౌదీ వెళ్లే పర్యాటకులకు తీపి కబురు..!

ABN, First Publish Date - 2022-10-23T08:18:07+05:30

పర్యాటక వీసాపై (Visit visa) తమ దేశానికి వచ్చే విదేశీయులకు సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. విజిట్ వీసా గడువు తేదీకి ఏడు రోజుల ముందు పొడిగించుకునే వెసులుబాటు ఇస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: పర్యాటక వీసాపై (Visit visa) తమ దేశానికి వచ్చే విదేశీయులకు సౌదీ అరేబియా తీపి కబురు చెప్పింది. విజిట్ వీసా గడువు తేదీకి ఏడు రోజుల ముందు పొడిగించుకునే వెసులుబాటు ఇస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. అయితే, దీనికి చెల్లుబాటయ్యే వైద్య బీమాను కలిగి ఉండాలనే షరతును విధించింది. వ్యక్తిగత సందర్శన వీసాలను అబ్షెర్ ప్లాట్‌ఫారమ్‌లోని (Absher platform) హోస్ట్ ఖాతా ద్వారా దాని చెల్లుబాటు గడువు ముగియడానికి ఏడు రోజుల ముందు పొడిగించబడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కానీ, ఈ విధానాన్ని పూర్తి చేయడానికి సందర్శకుడికి షరతులకు లోబడి వైద్య బీమా ఉండాలని తెలిపారు.

కాగా, విజిట్ వీసా మొత్తం పొడిగింపు 180 రోజులకు మించకూడదని జవాజాత్ (Jawazat) పేర్కొంది. అలాగే విజిట్ వీసా గడువు తేదీ నుండి మూడు రోజులు దాటితే దాని పొడిగింపును ఆలస్యం చేసినందుకు జరిమానా విధించబడుతుందని ధృవీకరించింది. అదే సమయం విజిటర్ వీసాను రెసిడెన్షియల్ వీసాగా (Residential visa) మార్చడం సాధ్యం కాదని జవాజత్ స్పష్టం చేసింది. అలాగే హోస్ట్ రికార్డు ట్రాఫిక్ ఉల్లంఘనలను కలిగి ఉన్నట్లయితే, అబ్షెర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అతని రికార్డులో ఉన్నవారికి సందర్శకుల వీసా యొక్క పునరుద్ధరణకు ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది.

Updated Date - 2022-10-23T08:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising