ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anil Bathula: ముఫ్ఫై ఏళ్ళుగా అనువాద కవిత్వ సంకలనం రాలేదని..!

ABN, First Publish Date - 2022-12-21T11:13:02+05:30

నాలుగుసార్లు వడపోసి 480 పేజీలకు కుదించాం.

దేశదేశాల కవిత్వం.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచన ఏదైనా కవిత్వమే. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. దైనందిన జీవిత సంఘర్షణల్లో ఒరుసుకున్న మనసుకు కమ్మని పాట, మనసు నిండే సాహిత్యాలే ఆలంబనలు. ఆ అనుభూతిని సాహితీ ప్రియులకు అందించే క్రమంలో, కవిత్వ అన్వేషణలో అనిల్ బత్తుల కృషి ఫలించి, దేశదేశాల కవిత్వంగా పురుడు పోసుకుంది. ఈ పుస్తకం తెలుగు కవిత్వ ప్రియుల మనసును దోచేందుకు బుక్ ఫెయిర్ లో అందుబాటులోకి రానుంది.

అనిల్ బత్తుల మాటల్లో దేశదేశాల కవిత్వం ముచ్చట్లు..

1. దేశదేశాల కవిత్వం గురించి?

ఈ బృహత్ సంకలనానికి గౌరవ సంపాదకుడిగా గాలి నాసరరెడ్డి, సంపాదకుడిగా నేను వ్యవహరించాం. ఇది దేశదేశాల కవుల వైవిధ్యభరితమైన అనువాద కవితా సంకలనం. దీనిలో భారతీయ కవుల కవితలు కూడా ఉన్నాయి. గత వందేళ్లలో (1922-2022) తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని వొడిసిపట్టే ప్రయత్నమిది. ఈ సంకలనంలో 207 మంది కవులు, 158 మంది అనువాదకులు ఉన్నారు. మొత్తం 281 కవితలతో వస్తుంది దేశదేశాల కవిత్వం.

2. ఇలా 158 మంది మంది అనువాద కవుల కవిత్వంతో పుస్తకం తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది?

ఆరునెలల క్రితం నేను 'దేశదేశాల కవిత్వం' అనువాద కవితా సంకలనం పని మొదలుపెట్టినప్పుడు పటిష్టమైన ప్రణాళికంటూ లేదు. ఎంత మంది అనువాద కవులు వుండాలి? ఎన్ని కవితలు వుండాలి? ఎందరు మూల కవులు వుండాలి? ఎన్ని పేజీలు వుండాలి? ఒకే పుస్తకమా? లేదా రెండు భాగాలా? వంటి సాంకేతిక వివరాల గురించి ఆలోచించలేదు. కేవలం అనువాద కవిత్వం మీద వున్న ప్రేమతో, పది కాలాలపాటు నిలిచిపోయే సంకలనంగా తేవాలనే తపనతో మొదలుపెట్టిన పని మాత్రమే, నెమ్మదిగా నిడివిలోనూ, లోతులోనూ విస్తరిస్తూ పోయింది.

మొదట నేను 100 నుండి 150 పేజీల పుస్తకం అనుకున్నాను. మహా అంటే 10 మంది అనువాదాలు తీసుకుందాము అనుకున్నాను. కానీ చివరికి 100 పేజీలు అనుకున్న పుస్తకం కాస్తా 800 పేజీల బృహత్ సంకలం అయ్యింది. నా అదృష్టం కొద్ది ఇష్టకవి గాలి నాసరరెడ్డి గారు ఈ 800 పేజీల పుస్తకాన్ని వడపోయడానికి అంగీకరించారు. ఆయన దీన్ని నాలుగుసార్లు వడపోసి 480 పేజీలకు కుదించారు. ఆయనకు నమస్కరించుకుని గౌరవ సంపాదకుడిగా ప్రకటించుకున్నాను.

3. కవిత్వాన్ని మన తెలుగు కవులు రాసినవే ఎంచవచ్చు కదా అనువాదాలను ముఖ్యంగా తీసుకోవడానికి వెనుకున్న కారణం?

తెలుగు కవుల కవిత్వంతో ఈ వందేళ్ళలో విరివిగా సంకలనాలు వున్నాయి. కొన్ని సంస్థల తరుపున ప్రతి సంవత్సరం వస్తున్నాయి. కానీ అనువాద కవిత్వ(వచన అనువాదం మాత్రమే పద్య అనువాదం కాదు) సంకలనం ఇప్పటి వరకు ఒకటే వచ్చింది. అది 1991 నవంబర్లో రంజనీ సంస్థ తరుపున వచ్చిన ' విశ్వ కవిత '. దీనికి కవి శివారెడ్డి గారు, కవి నిఖిలేశ్వర్ గారు సంపాదకులుగా వ్యవహరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కాటంటే ఒక్క అనువాద కవిత్వ సంకలనం రాలేదు. ముప్పై యేళ్ళుగా ఏ అనువాద కవిత్వ సంకలనం రాలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాను, బాధపడ్దాను.

4. వందేళ్ళ కవిత్వాన్ని ఒకచోట చేర్చడంలో మీరు పడిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?

ఈ పుస్తకం కోసం నేను ఆరు నెలలు పరిశోధన జరిపాను. కొన్ని రోజులు లైబరీలలోనే గడిపాను. 1922 నుండి 2022 వరకు తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని ఒడుసిపట్టే ప్రయత్నం చేశాను. సుమారు ఆరు వేల పేజీల అనువాద కవిత్వం చదివి, దాన్నుండి 800 పేజీల అనువాద కవిత్వాన్ని ఎంపిక చేశాను. 158 మంది అనువాదకుల్లో సుమారు 150 మంది అనువాదకుల నుంచి, వారసుల నుంచి అనుమతి తీసుకున్నాను. ఒక 8 మందిని సంప్రదించలేక పోయాను. వారు పెద్ద మనస్సుతో క్షమిస్తారని, అర్థం చేసుకుంటారని నమ్ముతాను.

5. ఈ పుస్తకం బుక్ ఫెయిర్ లో ఏ స్టాల్ లో అందుబాటులో ఉండబోతుంది?

దేశదేశాల కవిత్వం పుస్తకం పేజీలు 480, వెల 500 రూపాయలు. ఈ సంవత్సరం జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ క్రింది స్టాల్స్ లో, బోధి ఫౌండేషన్ తరుపున ప్రచురించిన మా పుస్తకం దొరుకుతుంది.

ఛాయా రిసోర్స్ సెంటర్ - 159

తెలంగాణా పబ్లికేషన్స్ - 31

లోగిలి బుక్ హవుస్ - 149 - 150

పల్లవి పబ్లికేషన్స్ - 252 నుండి 254 వరకు

Updated Date - 2022-12-21T15:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising