Sandeep Raj: బాలచందర్ సినిమా స్ఫూర్తిగా 'ముఖచిత్రం'

ABN , First Publish Date - 2022-12-07T16:07:17+05:30 IST

తను చదివిన కొన్ని వార్తలు, న్యూస్ ఆర్టికల్స్ ఆధారంగా, అలాగే సందీప్ అభిమాన దర్శకుడు బాలచందర్ సినిమాలోని ఓ సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నాను అని చెప్పాడు సందీప్. (

Sandeep Raj: బాలచందర్ సినిమా స్ఫూర్తిగా 'ముఖచిత్రం'

జాతీయ అవార్డు గెలుచుకున్న సినిమా 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ ఇప్పుడు 'ముఖచిత్రం' అనే సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. గంగాధర్ ఈ 'ముఖచిత్రం' సినిమాకి దర్శకుడు. అయితే కథ గురించి సందీప్ మాట్లాడుతూ ఈ కథ లాక్ డౌన్ నేపథ్యంలో సాగుతుంది అని చెప్పాడు. దాని ప్రస్తావన పదే పదే రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పాడు. తను చదివిన కొన్ని వార్తలు, న్యూస్ ఆర్టికల్స్ ఆధారంగా, అలాగే సందీప్ అభిమాన దర్శకుడు బాలచందర్ సినిమాలోని ఓ సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నాను అని చెప్పాడు సందీప్. (National Award winner Sandeep Raj is providing story, screenplay, dialogues for the upcoming film 'Mukha Chitram'. Gangadhar is the director for this film. Apart from various news articles, Sandeep inspired from a scene from his favourite director Balachander's film)

sandeep-raj.jpg

సినిమా కథ గురించి మాట్లాడుతూ, ఒక ప్లాస్టిక్ సర్జన్ ప్రమాదంలో గాయపడిన తన ప్రియురాలి ముఖానికి మరొకరి ముఖాన్ని అమర్చుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా అంతా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ రాసుకున్నప్పుడే ఇందులో నటించేందుకు కొత్త నటీనటులు, ఇమేజ్ లేని వారు కావాలని అనుక్కున్నారు. ఎందుకంటే పేరున్న వాళ్లు నటిస్తే, ఎవరు విలన్ ఎవరు మంచి వారు అనేది ప్రేక్షకులు తొందరగా గుర్తు పట్టేస్తారు అని చెపుతూ ప్రియా వడ్లమాని, అయేషా అద్భుతంగా నటించారు అని వాళ్ళకి కితాబు ని ఇచ్చాడు సందీప్. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద పెద్ద చిత్రాలనే చూసేందుకు వస్తున్నారు అని అంటున్నారు కానీ ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందని సందీప్ చాల నమ్మకంగా వున్నాడు.

Updated Date - 2022-12-07T16:07:20+05:30 IST