డబ్బు కోసం ATMకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ అనుభవం
ABN, First Publish Date - 2022-10-27T12:25:10+05:30
డబ్బులు విత్‌డ్రా చేయడం కోసం ATMకు వెళ్లిన వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. డబ్బులు డ్రా చేయగా.. రూ.200నోటుపై Full of Fun అని రాసి ఉండటాన్ని చూసి సదరు వ్యక్తి..
ఇంటర్నెట్ డెస్క్: డబ్బులు విత్‌డ్రా చేయడం కోసం ATMకు వెళ్లిన వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. డబ్బులు డ్రా చేయగా.. రూ.200నోటుపై Full of Fun అని రాసి ఉండటాన్ని చూసి సదరు వ్యక్తి బిత్తరపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో పోలీసులు ఏం సమాధానం చెప్పారు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనే వివరాల్లోకి వెళితే..
దీపావళి సందర్భంగా షాపింగ్ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి స్థానికంగా ఉన్న ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎం కార్డును ఉపయోగించి.. కొంత డబ్బు డ్రా చేశాడు. ఈ నేపథ్యంలోనే రూ.200నోటుపై Full of Fun అని రాసిఉండటం.. రిజర్వ్ బ్యాంకు స్థానంలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. ఏటీఎం నుంచి ఫేక్ నోట్లు వచ్చినట్టు గ్రహించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆ బాధితుడు మీడియాను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో సాబ్జి మండి ప్రాంతంలోని మున్షిగంజ్ రోడ్డులో ఉన్న ఏటీఎం నుంచి దొంగ నోట్లు వస్తున్నాయనే వార్త స్థానికంగా వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున స్థానికులు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఎట్టకేలకు ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. దీపావళి సెలవుల తర్వాత బ్యాంకు అధికారులను విచారించినున్నట్టు వెల్లడించారు.
Updated Date - 2022-10-27T14:04:41+05:30 IST