Shocking Video: వైరల్‌గా మారిన ఆస్పత్రి వీడియో.. చైనాలో కరోనా కేసులు మరీ ఇంత దారుణంగానా..!
ABN , First Publish Date - 2022-12-20T15:23:50+05:30 IST
మానవాళిని వణికించి, విలయం సృష్టించిన కరోనా మహమ్మారి (Corona Virus)ని ప్రపంచం ఇప్పుడిప్పుడే మరిచిపోతోంది. ఈ దశలో ప్రపంచ దేశాలను చైనాలో (China Corona virus cases) పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
మానవాళిని వణికించి, విలయం సృష్టించిన కరోనా మహమ్మారి (Corona Virus)ని ప్రపంచం ఇప్పుడిప్పుడే మరిచిపోతోంది. ఈ దశలో ప్రపంచ దేశాలను చైనాలో (China Corona virus cases) పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. చైనాలో జీరో-కోవిడ్ పాలసీ నిబంధనలను సడలించడంతో కరోనా రక్కసి వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. వచ్చే మూడు నెలల్లో చైనాలో 60 శాతం మందికి పైగా కరోనా బారిన (60% Of China May Get Infected to Covid-19 in 3 months) పడతారని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫిగెల్ అంచనా వేస్తున్నారు.
రోగులతో పూర్తిగా నిండిపోయిన ఓ చైనా ఆస్పత్రికి (China Hospitals) సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చైనాలో పరిస్థితిని కళ్లకు కడుతోంది. చైనాలో ప్రస్తుతం కరోనా మరణాలు (Covid-19 deaths) ఎక్కువగానే ఉన్నాయని, అయితే ఆ సంఖ్యను మాత్రం బయటకు రానివ్వడం లేదని ఎరిక్ పేర్కొన్నారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఇటీవల చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ పాలసీని (zero covid policy) ఎత్తేసింది. అప్పట్నుంచి రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బీజింగ్‌లోని కొన్ని స్మశాన వాటికలు కోవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అలాగే ప్రధాన నగరాల్లో మందుల కొరత ఏర్పడినట్టు కూడా తెలిపింది.